ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ దారుణంగా హత్యకు గురయ్యారు. లాస్ ఏంజెలెస్‌లోని వారి నివాసంలో అనుమానాస్పద రీతిలో వీరి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలపై కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కాగా, రాబ్ రీనర్కు సపోర్టింగ్ యాక్టర్‌గా రెండు ఎమ్మీ అవార్డులు లభించాయి.