ADB: తలమడుగు రుయ్యాడి గ్రామ పంచాయతీ రిజర్వేషన్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గ్రామస్థులు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోయినా, సర్పంచ్ పదవి, ఐదు వార్డు స్థానాలను ఎస్టీ వర్గానికి కేటాయించడం చట్టబద్ధం కాదని పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ రమేశ్ వాదనలు వినిపించినట్లు ఎల్చాల దత్తాత్రి తెలిపారు.