BDK: మణుగూరు మండలం RTC డిపోను రాష్ట్ర ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఇవాళ సందర్శించారు. ముందుగా డిపో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.