నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. వీరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్‌కు రూ.90 కోట్ల రుణం ఇవ్వగా, యంగ్ ఇండియా ద్వారా AJLను రూ.50 లక్షలకే సొంతం చేసుకున్నారని ఈడీ ఆరోపించినా.. కోర్టు ఈడీ అభ్యర్థనను పక్కన పెట్టింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.