తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ఇది థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా OTT హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను జీ5 రూ.52 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధికమని సినీ వర్గాలు పేర్కొన్నాయి.