అండర్-19 ఆసియా కప్లో టీమిండియా జోరు చూపిస్తోంది. మలేషియాతో జరుగుతున్న మ్యాచ్లో మలేషియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన భారత్.. 11 ఓవర్లలో 91/3 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించి 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (50) చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం వేదాంత్ (11), అభిజ్ఞాన్ (2) క్రీజులో ఉన్నారు.