ATP: ప్రభుత్వ ఆస్పత్రిలో 57 మంది పారిశుద్ధ్య కార్మికుల తొలగింపుపై 41 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 16 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. అనంతరం RDO కేశవ నాయుడు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. కాంట్రాక్టర్ చర్చలకు వచ్చేవరకు ఏ ఒక్క కార్మికుడిని తొలగించవద్దని, కొత్తవారిని నియమించవద్దన్నారు.