VZM: బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జి. ప్రశాంత్ కుమార్ చెప్పారు. టెన్త్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. జాబ్ మేళాకు 10 బహుళజాతి కంపెనీలు హాజరవుతాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.