VZM: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా విజయనగరం వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న ర్యాలీకి అనుమతిని నిరాకరణ చేస్తున్నట్లు టౌన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆదివారం తెలిపారు. సీఎంఆర్ నుండి కన్యకాపరమేశ్వరి వరకు నిత్యం రద్దీగా ఉండడంతో ర్యాలీకి అనుమతులు నిరాకరించినట్లు తేల్చి చెప్పారు.