సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి పనిచేస్తోందన్నారు. హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన మహా ధర్నాలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.