HNK: ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి జన్నపురెడ్డి దేవిక 236 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల విశ్వాసంతో ఈ విజయం దక్కిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.