VSP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ మద్దతు లభించింది. విద్యార్థులు, మేధావులు, ప్రజల భాగస్వామ్యంతో 95,500 సంతకాలను సేకరించారు. ఈ సంతకాల ప్రతుల బాక్స్‌లతో సోమవారం విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనాల్లో వీటిని తాడేపల్లికి పంపనున్నారు.