KMM: రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా కామేపల్లి మండలంలో ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 24 గ్రామపంచాయతీలు ఉండగా 6 పంచాయతీలు ముందుగానే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 18 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.