ఓట్ చోరీపై కాంగ్రెస్ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఓటు చోరీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. దీనీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నినాదాలు చూస్తుంటే, మోదీని ప్రధాని పదవి నుంచి దించే కుట్ర చేస్తున్నట్లు ఉందని బీజేపీ వ్యాఖ్యానించింది.