KMM : జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికలలో 7 మండలాల్లో 20 సర్పంచ్ స్థానాల్లో పోటీచేసి 14 చోట్ల ఎర్రజెండాను ఎగురవేశారు. ఖమ్మం జిల్లాలో 14, కొత్తగూడెం జిల్లాలో 6 చోట్ల సీపీఎం విజయం సాధించారు. మలిదశ పోరులోను సీపీఐ, సీపీఐఎం అభ్యర్థులు విజయం అందుకున్నారు. ఈ విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.