కృష్ణా: గౌడ, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం గుడివాడలో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా APSRTC చైర్మన్ కొనకళ్ళనారాయణ రావు గారి సోదరులు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.