KRNL: శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన అభివృద్ధికి ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన బోయ ఉల్లిగయ్య, నారాయణ, కవిత రూ.1,01,500 లక్షలు విరాళంగా అందించారు. దాతలకు దేవస్థాన అధికారులు స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు వీరేంద్ర స్వామి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.