హైదరాబాద్ పర్యటనలో మెస్సీకి మనోళ్లు అదిరిపోయే విందు ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, ఖుబానీ కా మీఠా వంటి స్వీట్స్ ఏర్పాటు చేశారు. ఇక ఫలక్నుమా ప్యాలెస్లో మటన్ లుక్మీ, చికెన్ పకోడా, ఫిష్, ఆలూ సమోసా వంటి ఘాటైన వంటకాలు వడ్డించారు. మన హైదరాబాదీ స్పెషల్స్, ముఖ్యంగా ఇరానీ చాయ్, లుక్మీలను మెస్సీతో పాటు ఇతర ప్లేయర్స్ ఇష్టంగా తిన్నారు.