VZM: జిల్లాలో కానిస్టేబుళ్ళుగా ఎంపికైన స్థానిక పురుష, మహిళా అభ్యర్ధులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 5 గంటలకు హాజరుకావాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అభ్యర్ధితో పాటు మరొక ఇద్దరు మొత్తం ముగ్గురు హాజరుకావాలని సూచించారు. హాజరయిన అభ్యర్ధులు, వారితో వచ్చేవారికి టిఫిన్ భోజన సదుపాయం ఉంటుందని తెలిపారు.