PDPL: పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలింగ్ కేంద్ర వద్ద నిమిషం ఆలస్యం కావడంతో ఎన్నికల అధికారులు ఓటర్లను తిరస్కరించారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు NCC క్యాంపు నుండి వచ్చిన విద్యార్థి నిమిషం ఆలస్యం కావడంతో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయింది. తనకు అవకాశం కల్పించాలని ఎన్నికల అధికారిని కోరినప్పటికీ సమయం అయిపోయిందంటూ తిరస్కరించారు.