TG: కేబినెట్ ప్రక్షాళనపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం అని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. DCC పదవుల్లో BCలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. కేబినెట్లోకి తాను వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సీఎం పట్టుదలతో ఉన్నారని తెలిపారు. భవిష్యత్లో HYDతో ఎవరూ పోటీపడలేని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.