ADB: బేల మండలంలోని 30 గ్రామపంచాయతీలకు గురువారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 27, 071 ఓటర్లు ఉండగా.. పురుషులు 11, 338, మహిళలు 11, 040 కలిపి మొత్తం 22, 378 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మండలంలో 82.66% ఓటు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.