సత్యసాయి: హిందూపూర్ రూరల్ సీఐ, సిబ్బంది లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్దలపల్లి గ్రామంలో గ్రామా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రతా నియమాలు, మహిళల భద్రత, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, డయల్ 100 వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల గురించి, పోలీసు అనుమతులు పొందడం గురించి కూడా వారికి వివరించారు.