CTR: మన బలం బలగం జగనన్న అంటూ మాజీ మంత్రి ఆర్కేరోజా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో తన నివాస కార్యాలయంలో ఆమె సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. YCP మనం తలదాచుకునే చెట్టులాంటిదన్నారు. ఆ చెట్టు పటిష్టంగా ఉంటేనే మనందరినీ రక్షించడంతో పాటు మనకు ఫలాలు అందిస్తుందన్నారు.