జాగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామ సర్పంచ్‌గా పరమాల సుమలత మల్లేశం విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమీప ప్రత్యర్థిపై 454 ఓట్ల మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.