WG: తణుకు పట్టణంలోని ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. సజ్జాపురానికి చెందిన ఆకుల రత్తయ్య ఇంట్లో ఈనెల 11న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా సర్వం కోల్పోయారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి కారుమూరి వైసీపీ నాయకులతో కలిసి రత్తయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.