SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోయినపల్లి మండలంలో 80.11, ఇల్లంతకుంట 84.64, తంగళ్ళపల్లి 77.72శాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 104905 మంది ఓటర్ల గాను 84747 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 80.78శాతం నమోదు అయ్యింది.