WGL: నల్లబెల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహభరితంగా తరలివచ్చిన యువ ఓటర్లు ప్రజాస్వామ్య బాధ్యతను గర్వంగా నిర్వర్తించారు. ఓటు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వాములమయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.