WG: తణుకులో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం సంచారశకటం ద్వారా ఇంటింటికి వైద్యం కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ హుస్సేస్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సిబ్బందితో కలిసి తణుకు, ముక్కామల, పైడిపర్రు ప్రాంతాల్లో పర్యటించి మంచానికే పరిమితమైన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు.