సౌతాఫ్రికాతో మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫెర్రీరా వికెట్ పడగొట్టడం ద్వారా, వరుణ్ తన T20I కెరీర్లో 50 వికెట్లను (32 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్నాడు. దీంతో, భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా వరుణ్ నిలిచాడు. కుల్దీప్ యాదవ్ (30 మ్యాచ్లు) ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.