AP: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అడ్వైజరీ సర్వీసెస్ భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి మోసం చేసి, రూ.30 కోట్లకుపైగా కొల్లగొట్టిన సంస్థ సీఈవో శివానీ పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.