NTR: మైలవరం ఎస్సీ కాలనీ స్మశాన స్థలంలో చెట్లు అధికంగా పెరిగి ఇబ్బందికరంగా మారడంతో, ఈ విషయాన్ని సంఘ పెద్దలు మైలవరం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన లితీష్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు స్మశాన వాటిక స్థలంలో జంగిల్ క్లియరెన్స్ పనులను ఆదివారం చేపట్టారు.