AP: అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అరకులోయలో శనివారం ఉదయం 3.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం వెల్లడించింది. డుంబ్రిగుడ-4.1, ముంచంగిపుట్టు-4.4, జి.మాడుగుల-4.8, చింతపల్లి-5.5, పాడేరు-6.2, హుకుంపేట-6.7, పెదబయలు-7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.