EG: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ట్రయనింగ్ క్యాంప్‌లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని ఆయన పేర్కొన్నారు.