ASR: పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును చింతూరు పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడ వెళుతున్న ఈ బస్సు వివరాలపై సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేశ్ ఆరా తీస్తున్నారు. ఇటీవల చింతూరు ఘాట్ ప్రమాదం అనంతరం పోలీసులు పర్యాటకులతో వెళుతున్న వాహనాలు, భారీ గూడ్స్ వెహికల్స్ పై నిఘా పెంచారు.