NLR: ఇంధనాలను పొదుపుగా వాడి, పర్యావరణాననుకూల జీవనశైలి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవటం ద్వారా భారతావని భవితకు బాటలు వేయవచ్చని గ్రీనరీ పురస్కార గ్రహీత సుధీర్ కుమార్ అన్నారు. బుచ్చి గ్రంథాలయంలో ఆదివారం జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషయిన్సీ నిర్దేశించిన విద్యుత్ ఉపకరణాలను మాత్రమే వాడాలన్నారు.