TG: రాష్ట్రంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటు వేయవచ్చు. ఈ విడతలో మొత్తం 3,906 సర్పంచ్, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఉపసర్పంచ్‌లను కూడా ఈరోజే ఎన్నుకుంటారు.