ADB: మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరపున గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన గ్రామాల అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలకు ఆసరాగా నిలిచిన కేసీఆర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.