MDK: తూప్రాన్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొదటి రెండు గంటలలో ఉదయం తొమ్మిది గంటలకు 25.49 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం చలి కారణంగా కొంత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చినప్పటికీ, కొద్దిసేపటి తర్వాత పోలింగ్ సరళి పెరిగిపోయింది. మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.