నెల్లూరు జిల్లాలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారాయి. మాండౌస్, దిత్య తుపాను వర్షాలకు 192 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 8.08 కోట్లు, శాశ్వత పనులకు రూ. 69.85 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. సర్వేపల్లి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్లో పరిస్థితి దారుణంగా ఉంది.