ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లో గల మంత్రి స్వామి క్యాంపు ఆఫీస్లో ఆదివారం స్వామిని ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్గా ఎన్నికైన సుచిత్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్రకు మంత్రి స్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాను గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.