KRNL: కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పరిశుభ్రతపై లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. ప్రతి ఫిర్యాదుకు గడువు నిర్ణయించి పరిష్కరిస్తారని, పురోగతిని meekosam.ap.gov.inలో తెలుసుకోచ్చన్నారు.
Tags :