WG: రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో కాపులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. ఆదివారం తణుకులో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలపై ఉన్న వివక్ష, అణిచివేతను కాపులపైనా చూపిస్తున్నారని అన్నారు.