ADB: రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆదివారం తాంసి మండలం పొన్నారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పోలింగ్ కొనసాగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సరళిని సైతం పరిశీలించారు.