నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోరుటూరులో చోరీ జరిగింది. పెద్ది ఆదిలక్ష్మి, నాగరాజు దంపతులు వ్యవసాయ రుణం కోసం దాచిన 8 సవర్ల బంగారాన్ని బీరువాలో ఉంచి గుడికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నగలు కనిపించలేదు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.