NRML: గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం ఆదివారం జిల్లాలో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ గ్రామీణ మండలంలోని వెంగ్వాపేట్, తల్వేద, లంగ్డాపూర్ గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళి మరియు ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.