మంచిర్యాల జిల్లాలో మొదటి ఫలితం వెళ్లడయింది. తాండూరు మండలంలో మొదటి నరసాపూర్ సర్పంచ్‌గా మడావి ప్రభాత్ రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కుర్షింగ బాపూరావుపై 215 ఓట్లతో గెలుపొందారు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.