MNCL: జిల్లాలో ఇవాళ జరిగిన రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల మానవీయత పలువురి ప్రశంసలు అందుకుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, మహిళలు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పోలీసులు సహాయం అందించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతతో పాటు ఓటర్లకు చేయూత అందించి వారు సురక్షితంగా ఓటు వినియోగించుకునేందుకు పూర్తి సహకారం అందించారు.