KRNL: కోసిగి మండలం అర్లబండ గ్రామానికి చెందిన పూజారి శివకుమార్ దంపతులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో ఒక నెల జీతాన్ని శ్రీశ్రీ శాంభవీ మఠం నిర్మాణానికి ఇవాళ విరాళంగా అందజేశారు. మొత్తం రూ.1,00,001 ఆలయ కమిటీకి అందించి, అమ్మవారి దయతోనే ఈ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. మఠం నిర్మాణానికి సహకారం అందించినందుకు దంపతులను గ్రామస్థులు అభినందించారు.