విశాఖపట్నం తీర ప్రాంత మత్స్యకార యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ ఈనెల 17 నుంచి 20 వరకు కైలాసగిరి ఏఆర్ గ్రౌండ్లో జరగనుండగా, ప్రారంభ కార్యక్రమానికి డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరవుతారు.